రామాపురంలో వెల్లివిరిసిన మత సామరస్యం
SRPT: చిలుకూరు ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు షేక్ హస్నా శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొని మత సామరస్యం చాటారు. రామాపురం గ్రామంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణం అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. కేవలం అతిథిగా కాకుండా, ఒక సేవకుడిలా మారి భక్తులకు స్వయంగా మజ్జిగ, మంచి నీరు పంపిణీ చేసి వారి దాహార్తిని తీర్చారు.