బస్సులో గుండెపోటు.. వృద్ధురాలి మృతి

బస్సులో గుండెపోటు.. వృద్ధురాలి మృతి

KMR: బస్సులో వృద్ధురాలు మృతి చెందిన ఘటన కామారెడ్డి పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన అనసూయ(60) అనారోగ్యంతో కామారెడ్డి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం ఆదివారం వచ్చింది. ఎర్రపహాడ్ వెళ్లేందుకు బస్సు ఎక్కింది. బస్సు దేవునిపల్లి గ్రామానికి చేరుకోగానే అనసూయ ఛాతిలో నొప్పిగా ఉందంటూ పడిపోయింది.