బాలుడిని బెదిరించి.. డబ్బులు కాజేశారు
NLR: బుచ్చి రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే బాలుడిని ఇద్దరు బెదిరించి డబ్బులు కాజేసిన వారిపై ఎస్సై సంతోశ్ రెడ్డి కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు ప్రవీణ్‌ను బెదిరించి ఫోన్ పే ద్వారా రూ.500 నగదు వేయించుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి లావాదేవీల తీరుపై పోలీసులు ఆరా తీశారు.