ఏకగ్రీవంగా పీఆర్ మినిస్ట్రీయల్ అసోసియేషన్ ఎన్నికలు
AKP: ఏపీ పంచాయతీ రాజ్ మినిస్ట్రీయల్ అసోసియేషన్ నక్కపల్లి మండల యూనిట్ అధ్యక్షుడిగా డీ. సీతారామరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా కే. సూరిబాబు, కార్యదర్శిగా డీవీఎస్ఆర్ రాజును ఎన్నుకున్నారు. అలాగే జాయింట్ సెక్రటరీగా కే. సుజాత, కోశాధికారిగా సత్య నూకరత్నం ఎన్నికయ్యారు.