పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
PLD: రాజుపాలెం (మం) అంచులు వారి పాలెం గ్రామంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పశు వైద్య శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రైతులకు మేలు చేకూరుతుందని తెలియజేశారు. వైద్య శిబిరాన్ని రైతులందరూ వినియోగించుకోవాలన్నారు. ఉచితంగా మందులను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.