సమాచార హక్కు చట్టం అమలు చేయాలి: భీమ్ ఆర్మీ

సమాచార హక్కు చట్టం అమలు చేయాలి: భీమ్ ఆర్మీ

GDWL: జిల్లాలో సమాచార హక్కు చట్టం (RTI) 2005 ప్రకారం 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇంఛార్జ్ మాచర్ల ప్రకాష్, ఆర్టీఐ కమిషనర్ శ్రీనివాసరావును కోరారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కమిషనర్‌ను కలిసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.