నేరాల నియంత్రణకు ఆకస్మిక వాహన తనిఖీలు

నేరాల నియంత్రణకు ఆకస్మిక వాహన తనిఖీలు

PDPL: రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గోదావరిఖనిలో జీఎం ఆఫీస్, 5 ఇంక్లైన్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో నాకాబంది నిర్వహించి ఆకస్మిక వాహన తనిఖీలు చేశారు. అనుమానితులు, అక్రమ రవాణా, మత్తు పదార్థాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. వాహన పత్రాలు పరిశీలించి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు చేశారు.