కేంద్ర మంత్రిని కలిసిన కంకణాల

కేంద్ర మంత్రిని కలిసిన కంకణాల

TPT: కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూ పేంద్ర యాదవ్‌ను ఢిల్లీలోని ఆయన నివాసంలో గూడూరుకు చెందిన కంకణాల పెంచల్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో కాలుష్యం ఎక్కువగా ఉందని, నియంత్రణ చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర కాలుష్యనియంత్రణ మండలి ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.