రాజీనామా చేసిన సింగిల్ విండో చైర్మన్

తిరుపతి: చంద్రగిరి మండలం నరిసింగాపురం సింగిల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళి రెడ్డి, పాలకమండలి సభ్యులు ఈశ్వర్ రెడ్డి, మురగారెడ్డి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా పత్రాలను బ్యాంక్ ఇంఛార్జ్ అధికారి భాస్కర్ రెడ్డికి అందజేశారు. రాజీనామా పత్రాలు ఆమోదించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.