'వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలి'

'వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలి'

TPT: రేణిగుంట చెక్ పోస్ట్ కూడలిలో పోలీస్, రవాణా శాఖ సంయుక్తంగా రహదారి భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్బన్ సీఐ జయచంద్ర మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించడం వాహనదారుడి ప్రాణానికే కాదు, కుటుంబ భవిష్యత్తుకు రక్షణ కవచం అని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరిచారు.