నేటి నుంచి ఆర్టిజన్ల సమ్మె

నేటి నుంచి ఆర్టిజన్ల సమ్మె

TG: తమ సమస్యలు, న్యాయపరమైన డిమాండ్లకు పరిష్కారమే లక్ష్యంగా కరెంట్ కార్మికులు సమ్మెకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 19 వేల మంది ఆర్టిజన్లు, 1400 మంది అన్‌స్కిల్డ్ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయూస్ JAC తెలిపింది. ఈ సమ్మెకు ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి.