ఘనంగా ఆదిశంకరాచార్యులు జయంతి

KKD: ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రజలను భక్తిమార్గంలో నడిపించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు జయంతిని శుక్రవారం సామర్లకోట పంచరామ క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. సమస్త జగత్తుకు అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ, హిందూ ధర్మ పరిరక్షణ కోసం సన్యాస దీక్ష చేపట్టి విశ్వానికి ఆది గురువుగా ప్రసిద్ధి చెందిన ఘనత ఆదిశంకరాచార్యకే దక్కిందని పలువురు పేర్కొన్నారు.