ఆ గ్రామాలలో సర్పంచ్‌లు వీరే..!
BDK: పినపాక మండలం సీతంపేట సర్పంచ్‌గా శివశంకర్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 572 ఓట్లతో రెండవసారి గెలుపొందారు. బూర్గంపాడు మండలం తాళ్లగోమూరు BRS బలపరిచిన గుమ్మడి కృష్ణవేణి 393 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చర్ల మండలం పులిగుండాల సర్పంచ్ అభ్యర్థి మిడియం లక్ష్మి 84 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయంపై నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.