నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLG: గుర్రంపోడు మండలంలోని గుర్రంపోడు, పోచంపల్లి సబ్ స్టేషన్ల పరిధిలో నేడు ఉదయం 7 గం.ల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ ఏఈ శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కనగల్ నుంచి వచ్చే 33కేవీ లైన్‌కు సంబంధించి విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా సరఫరాకు అంతరాయం కలుగుతున్నట్లు ఆయన అన్నారు. వినియోగదారులు, రైతులు ఈ విషయని గమనించాలని అన్నారు.