సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ
SKLM: ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేట గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కొరకు గురువారం ఎంపీపీ మొదలవలస చిరంజీవి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.4లక్షల రూపాయల మండల పరిషత్ నిధులతో ఈ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యతతో కూడిన నిర్మాణం పనులను త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.