జనసేన ఎంపీ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసం

KKD: జనసేన ఎంపీ, టీ టైమ్ యజమాని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.92.5 లక్షలు కొల్లగొట్టారు. ఎంపీ ప్రొఫైల్ పిక్చర్ ఉపయోగించి, వాట్సాప్ ద్వారా టీ టైమ్ సీఎఫ్‌ఓ శ్రీనివాసరావును మోసగించి డబ్బులు పంపమని మెసేజ్ చేశారు. నమ్మిన సీఎఫ్‌ఓ రూ.92.5 లక్షలు పంపగా, మోసం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.