కుండలేశ్వర స్వామి ఆలయం వద్ద అపశృతి
కోనసీమ: కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో ఉన్న కుండలేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం అపశృతి చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన బొట్టా నిర్మల(67) గుండెపోటుతో మృతి చెందింది. ఆమె స్వామి వారి దర్శనం చేసుకుని, అన్న ప్రసాదం స్వీకరించి, బయట కూర్చుని ఉండగా ఆకస్మికంగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు.