మెగా జాబ్ మేళాలో 1,132 మందికి ఉద్యోగాలు
అనకాపల్లి ఓ ప్రైవేట్ కళాశాలలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 1,132 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ మేరకు నియామక పత్రాలను సంస్థ జిల్లా అధికారి గోవిందరావు, జనసేన నియోజకవర్గం సమన్వయకర్త బీమరశెట్టి రాంకీ అందజేశారు. 52 కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలో 2,130 అభ్యర్థులు పాల్గొన్నారు.