ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

సత్యసాయి: ధర్మవరంలోని స్థానిక మార్కెట్ యార్డులోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈ త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. ఈవీఎంల భద్రత విషయంలో రాజీ పడకూడదని, నిరంతరం పటిష్టమైన నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.