జీవన్ రెడ్డిపై విప్ ఆది శ్రీనివాస్ సెటైర్లు
SRCL: జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండగా కేసీఆర్ అల్లంగా.. బీఆర్ఎస్ పార్టీలో చేరగానే బెల్లంగా మారాడని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై మండిపడ్డారు. ఆయన మాటలు చూస్తే.. నవ్వాలో, ఏడవాలో అర్ధం కావట్లేదని, ఆయన చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు.