రోడ్డవలసలో వ్యాధి నిరోధక టీకాలు

మన్యం: పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ రోడ్డవలస గ్రామంలో పలువురు గర్భిణీలకు, చిన్న పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. బుధవారం సచివాలయం ANM బోడమ్మ అంగన్వాడీ కేంద్రంలో టీకాలు వేయడం జరిగింది. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచితంగా వేస్తున్నా టీకాలు గర్భిణీలు, చిన్నపిల్లలు తప్పనిసరిగా వేయించుకోవాలని, టీకాలు వేయించుకోవడం వలన వ్యాధులు దరి చేరవన్నారు.