పేలని బాంబులను తిరిగిచ్చేయండి: అమెరికా
ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడుల్లో అమెరికాకు చెందిన GBU-39B ప్రెసిషన్ గైడెడ్ బాంబు లెబనాన్‌కు చిక్కినట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ పేలని బాంబును తిరిగి తీసుకునేందుకు శత్రుదేశమైన లెబనాన్‌ను అత్యవసరంగా సంప్రదించింది. చైనా, రష్యా, ఇరాన్ దేశాల చేతుల్లోకి వెళ్తే అమెరికా ఆయుధ సాంకేతికత బయటపడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతోంది.