ఇకపై అమెరికాతో శాంతి చర్చలు ఉండవు: ఇరాన్
యుద్ధం వేళ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికాతో శాంతి చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పింది. అగ్రరాజ్యానితో ఉన్న అన్ని దౌత్య, పరోక్ష సంభాషణ మార్గాలను ఇరాన్ మూసివేసిందని ఆ దేశ ప్రభుత్వరంగ మీడియా సంస్థ టెహ్రాన్ టైమ్స్ వెల్లడించింది. అలాగే ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడిని కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.