VIDEO: అగ్ని ప్రమాదంలో పొగాకు దగ్ధం

VIDEO: అగ్ని ప్రమాదంలో పొగాకు దగ్ధం

ప్రకాశం: పొన్నలూరు మండలం కల్లూరువారి పాలెంలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన పొగాకు రైతులు జయరామిరెడ్డి పొగాకు బ్యారెన్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి 1200 పొగాకు కర్రలు కాలిపోయాయి. రూ.3 లక్షలు ఆర్థికంగా నష్టపోయారని రైతు వాపోయాడు. అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకునే లోపు పొగాకు మొత్తం కాలిపోయింది.