VIDEO: శేరేపాలెంకు స్వచ్ఛమైన తాగునీరు: ఎమ్మెల్యే

W.G: నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శుక్రవారం మొగల్తూరు మండలం శేరేపాలెం గ్రామంలో పైప్ లైన్ మైక్రో ఫిల్టర్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శేరేపాలెం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.కూటమి నాయకులు పాల్గొన్నారు.