రైలు ఢీకొని 150 గొర్రెలు మృతి

ASF: కాగజ్‌నగర్ నుండి సిర్పూర్‌టీ కి వెళ్ళే మార్గంలో సిర్పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకు తగిలి దాదాపుగా 150 గొర్రెలు మృతి చెందాయి. శనివారం మేతకు వెళ్ళిన గొర్రెలమంద వర్షం పడటంతో అవి రాత్రి రైల్వేట్రాక్ పై పడుకున్నాయి. అర్ధరాత్రి గుర్తు తెలియని రైలు గొర్రెలను ఢీకొనడంతో మృతి చెందినట్లు మేకలకాపరి ఆదివారం తెలిపారు. రైల్వేపోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.