'స్వదేశీ వస్తువులు మాత్రమే కొనుగోలు, అమ్మకాలు జరపాలి'

KMR: ప్రజలు స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు,అమ్మకాలు జరపాలనీ స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ రాష్ట్ర సహా సంయోజక్ అశోక్ జీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృత స్థాయిలో చర్చించారు.