VIDEO: 'పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమం నేపథ్యం ఇదే'

NLR: ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు గ్రామంలో 1921 ఏప్రిల్ నెలలో పోనక కనకమ్మ గాంధీజీ ఆశ్రమాన్ని స్థాపించారు. అనంతరం 1921 ఏప్రిల్ నెల ఏడవ తేదీన మహాత్మా గాంధీ ఇక్కడికి వచ్చి ఆశ్రమాన్ని ప్రారంభించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడ బస చేసేవారు. ఆశ్రమం చుట్టుప్రక్కల ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.