VIDEO: 'వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి'
KRNL: ప్రజలను బజారు పాలు చేస్తున్న అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. డోన్‌కు చెందిన నిజాముద్దీనన్‌ను వడ్డీ వ్యాపారి వేధించడంతో ఆరోగ్యం దెబ్బతిందని పేర్కొన్నారు. బాధితుడిని ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి వ్యాపారులపై కట్టడి అవసరమని తెలిపారు.