కడుపునొప్పి భరించలేక వృద్ధురాలు ఆత్మహత్య
KNR: కడుపునొప్పి, జ్వరంతో బాధపడుతూ జీవితంపై విరక్తితో ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జమ్మికుంట మండలంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. సైదాబాద్‌కు చెందిన ముష్కే రాధమ్మ (68) ఇంటి నుంచి వెళ్లిపోగా కోరపల్లి వ్యవసాయ బావిలో శవమై తేలిందన్నారు. ఆమె కుమారుడు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.