BHPLలో భోజనానికి బదులు రేషన్ సరుకులు
BHPL: వేసవి ఎండల దృష్ట్యా మే నెలలో అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 644 కేంద్రాల్లో ఉన్న 18,555 మంది చిన్నారులకు భోజనం అందించడానికి బదులుగా రేషన్ సరుకులను ఇంటికే అందజేయనున్నారు. గర్భిణులు, బాలింతలకు కూడా ఈ వెసులుబాటు కల్పించారు. లబ్ధిదారులకు సకాలంలో పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.