'ఇందిరమ్మ ఇళ్లను నాణ్యతతో నిర్మించాలి'

'ఇందిరమ్మ ఇళ్లను నాణ్యతతో నిర్మించాలి'

VKB: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేసి నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని పరిగి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.