VIDEO: మున్సిపాలిటీలో పర్యటించిన ఎమ్మెల్యే
SKLM: ఆముదాలవలస మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎమ్మెల్యే కూన రవికుమార్ ద్విచక్ర వాహనంపై పర్యటించారు. బుధవారం పర్యటించిన ఆయనకు స్థానికులు డ్రైనేజీ సమస్యలు విపరీతంగా ఉన్నాయని దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆయన వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులను రప్పించి తక్షణమే డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని హెచ్చరించారు.