రౌడీషీటర్లకు బంగారుపాళ్యం సీఐ కౌన్సిలింగ్
CTR: బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ కత్తి శ్రీనివాసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, గొడవల్లో పాల్గొంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ వారి ఆదేశాలు ఉల్లంఘించి నేరాల్లో పాల్పడితే జిల్లా బహిష్కరణకు సిఫార్సు చేస్తామని చెప్పారు.