VIDEO: నిమ్మనగర్‌లో ఉబికి వస్తోన్న పాతాళ గంగ

VIDEO: నిమ్మనగర్‌లో ఉబికి వస్తోన్న పాతాళ గంగ

ములుగు జిల్లా మల్లంపల్లి మండలం నిమ్మనగర్ వద్ద పాతాళగంగ ఉబికి వస్తోంది. వందల అడుగుల బోర్లు వేసినా నీరు రాని నిరాశలో ఉన్న రైతులు ఈ అద్భుతానికి ఆశ్చర్యపోతున్నారు. రామకృష్ణారెడ్డి అనే రైతు చెడిపోయిన బోరు మోటారు తొలగించగా.. ఆదివారం అనూహ్యంగా నీరు ఉబికి వచ్చింది. భారీ వర్షాలతో భూగర్భ జలాలు పెరిగి, ఎర్రమట్టి క్వారీల నీరు బయటకు వస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.