రేపటి నుంచి దివ్యాంగుల క్రీడా పోటీలు
NRML: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నవంబర్ 29 (శనివారం) నుంచి దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రన్నింగ్, షాట్పుట్, జావెలిన్ త్రో, చెస్, క్యారమ్స్ వంటి పోటీల్లో జూనియర్, సీనియర్ విభాగాల వారు పాల్గొనవచ్చన్నారు.