'అధికంగా ఎరువులు వాడొద్దు'

కోనసీమ: ఇష్టమొచ్చిన రీతిలో అధికంగా ఎరువులు వాడొద్దని, మట్టి నమూనా పరీక్షలు ఆధారంగా అవసరమైన మేరకు ఎరువులు వాడాలని ముమ్మిడివరం జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి జె.ఎన్.వి.వి మనోహర్ కోరారు. ఇవాళ మండపేట మండలం ఏడిదలో పంటలకు చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత ఖరీఫ్ వరి పంటలో ఎరువుల యాజమాన్యం వివరించారు.