ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి కొలుసు పార్థసారథి
కృష్ణా: రాష్ట్ర గౌడ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి జన్మదిన సందర్భంగా ఆదివారం తొట్ల వల్లూరులో ప్రభుత్వ వైద్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరంకి వెంకట గురుమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.