VIDEO: బంతిపూల సాగుతో మేలు
BPT: కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలో బంతిపూల సాగు ఈ సీజన్‌లో ఆశాజనకంగా సాగుతున్నట్లు రైతు భీమిశెట్టి బ్రహ్మయ్య తెలిపారు. ఒక ఎకరాలో బంతిపూల తోటను పెంచుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మార్కెట్‌లో బంతిపూల ధర కిలోకు 50 నుంచి 60 రూపాయల వరకు పలుకుతోందన్నారు. అయితే కార్తీకమాసం అనంతరం ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపారు.