అలర్ట్.. రేపు జాగ్రత్త..!
VZM: జిల్లాలో రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు APSDMA ఎండీ ప్రఖర్ తెలిపారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. మంచి నీరు, మజ్జిగ, ORS వంటివి ఎక్కువగా తీసుకోవాలన్నారు.