'యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి'

'యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి'

KMM: యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని ఎస్సై లక్ష్మీ భార్గవి సూచించారు. మధిర మండలం సిరిపురం గ్రామంలో ఈగల్ ఫోర్స్, మధిర రూరల్ పోలీసులు, లక్ష్మీ భార్గవి ఆధ్వర్యంలో మంగళవారం చైల్డ్ సేఫ్టీ-యాంటీ డ్రగ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. పిల్లల భద్రత, డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు.