భువనగిరిలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

భువనగిరిలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

BHNG: గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన, గ్రూప్స్‌కి సంబంధించిన పుస్తకాలు కొనుగోలు చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఏ భాస్కరరావు తెలిపారు. ఇవాళ స్థానిక జిల్లా గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. కాగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎండీ అవైస్ ఉర్ రెహ్మాన్ చిస్తి జాతీయ పతాకావిష్కరణ చేశారు.