నరసాపురంలో డ్రంకెన్ డ్రైవ్‌కు భారీ జరిమానా
W.G: నరసాపురంలో మద్యం తాగి వాహనాలు నడిపిన తొమ్మిది మందికి స్థానిక కోర్టు భారీ జరిమానా విధించింది. సోమవారం తనిఖీల్లో పట్టుబడిన వీరిని గురువారం మెజిస్ట్రేట్ ఎన్. శంకర్ ఎదుట హాజరుపరచగా, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.90 వేల అపరాధ రుసుము విధించారు. టౌన్ CI యాదగిరి మాట్లాడుతూ.. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు.