లారీని తప్పించబోయి యువకుడికి గాయాలు

GNTR: తుళ్లూరు తానాపతి చెరువు సమీపంలో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో పుల్లారావు అనే యువకుడికి మంగళవారం తీవ్ర గాయాలయ్యాయి. జి. కొండూరు మండలం కౌలూరు గ్రామానికి చెందిన పుల్లారావు తాడికొండ నుంచి తుళ్లూరు వైపు వస్తుండగా, లారీని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. గాయపడిన అతడిని చికిత్స కోసం తుళ్లూరు పీహెచ్‌సీకి తరలించారు.