డ్రోన్ల కోసం స్వదేశీ ఫ్లైట్ కంట్రోలర్

డ్రోన్ల కోసం స్వదేశీ ఫ్లైట్ కంట్రోలర్

ఢిల్లీకి చెందిన 'ఇండియన్ రోబోటిక్స్ సొల్యూషన్స్' (IRS) డ్రోన్ల కోసం సరికొత్తగా 'AlexDefx Flight Controller V1.0'ను అభివృద్ధి చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ కంట్రోలర్, డ్రోన్ల పనితీరును మెరుగుపరచడమే కాకుండా రక్షణ, పౌర అవసరాలకు ఎంతో కీలకం కానుంది. విదేశీ విడిభాగాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యానికి ఇది ఊతమిస్తుంది.