అమ్మవారి ఆలయానికి మకర తోరణం

SRD: పటాన్‌చెరు నియోజకవర్గం జిన్నారం మండలం జంగంపేట గ్రామంలోని రేణుకాఎల్లమ్మ అమ్మవారికి దాతలు మకర తోరణాన్ని బహూకరించారు. చౌదరి గూడెం గ్రామానికి చెందిన మద్దూరి మాధవి మల్లారెడ్డి దంపతులు మకరం రూపంతో తయారు చేయించిన లోహ తోరణాన్ని ప్రధాన అర్చకుడు శ్రీనివాస భార్గవ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గర్భగుడిలో అమ్మవారికి అలంకరించారు.