టోల్‌గేట్ మార్చాలని కేంద్ర మంత్రికి వినతి

VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని ఆయన కార్యాలయంలొ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈమేరకు పార్లమెంట్ పరిధిలో స్టేట్ హైవేస్‌ను నేషనల్ హైవేస్‌గా మార్చాలన్నారు. అలాగే రోడ్స్ అప్గ్రేడేషన్ కొరకు మొదలవలస-చెల్లూరు సమీపంలో ఉన్న జొన్నాడ టోల్‌గేట్‌ను మార్చేందుకు వినతిపత్రం అందజేశారు.