కోట్ల ఏళ్ల ముందు ఎవరెస్ట్ ఓ సముద్రం!
ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం ఒకప్పుడు సముద్రపు అడుగున ఉండేదంటే నమ్ముతారా? కోట్ల సంవత్సరాల ముందు అక్కడ టెథిస్ అనే సముద్రం ఉండేది. అందుకే ఎవరెస్ట్ శిఖరంపై ఇప్పటికీ సముద్ర జీవుల శిలాజాలు, సున్నపురాళ్లు కనిపిస్తాయి. భూమి పొరల్లో వచ్చిన మార్పుల వల్లే సముద్రం పోయి ఈ భారీ పర్వతం ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.