ప్రపంచకప్‌లో విల్ జాక్స్ వన్ మ్యాన్ షో!
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ప్రస్తుత T20 WCలో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఆడిన 7 మ్యాచ్‌ల్లో అతడు ఏకంగా 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కించుకున్నాడు. అటు బ్యాట్‌తో, ఇటు బాల్‌తో కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. కాగా, ఒకే T20 WC ఎడిషన్‌లో అత్యధిక MOM అవార్డులు అందుకున్న షేన్ వాట్సన్ (2012లో 4 అవార్డులు) రికార్డును సమం చేశాడు.