ఎక్సెజ్ శాఖ అదుపులో గంజాయిస్మగ్లర్లు

అన్నమయ్య: కోడూరు మండలం అనంతరాజుపేట గ్రామం వద్ద శనివారం జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమ గంజాయి రవాణాను అడ్డుకుని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై కోడూరు ఎక్సైజ్ శాఖ అధికారులను వివరణ కోరగా.. దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.